తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఇప్ప‌టికే రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఈ కొత్త పార్టీ ఏప్రిల్ 9న ప్ర‌క‌టిస్తాన‌ని ష‌ర్మిల ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ కొత్త పార్టీతో తమకు ఏమాత్రం నష్టం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. షర్మిల పార్టీ వ‌ల్ల అధికార టీఆర్ఎస్‌కే ఎక్కువ న‌ష్టం జ‌రుగుతుంద‌ని... టీఆర్ఎస్‌కు ప‌డే ఓట్ల‌నే ష‌ర్మిల పార్టీ చీలుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

ఇక తాము ష‌ర్మిల పార్టీని ఏ మాత్రం సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ని కూడా ఆయ‌న అన్నారు. ఇక నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నేత జానారెడ్డి గెలుపు ఖాయ‌మైన‌ట్టే అని కూడా భ‌ట్టి జోస్యం చెప్పారు. ఇక్కడ ప్రజలు జానారెడ్డిని ఆదరిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ప‌నిచేయ‌వ‌ని తెలిపారు. తెలంగాణ‌లో ష‌ర్మిల కొత్త పార్టీతో కాంగ్రెస్‌కే ఎక్కువ న‌ష్టం జ‌రుగుతుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలోనే భ‌ట్టి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: