ఏపీలో వరుస షాకులతో విలవిల్లాడుతోన్న టీడీపీకి శ్రీకాకుళం జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలింది. జిల్లాలోని ఆముదాల వలసలో
టీడీపీ సీనియర్ నేత
పార్టీ వీడారు. మాజీ
ఎమ్మెల్యే, విప్ కూన
రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్‌రావు టీడీపీకి
రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుచరులతో చర్చించాక తాను ఏ పార్టీలో చేరతానో చెపుతానని అన్నారు.
ఇక చంద్రబాబు నిర్ణయాల వల్లే టీడీపీకి మనుగడ లేకుండా పోయిందని ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుపై సైతం ఆయన విమర్శలు చేశారు. రిగ్గింగ్‌తోనే ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారని ఆయన ఆరోపించారు.