ఏపీ స‌చివాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. స‌చివాల‌య ఉద్యోగులు వ‌రుస‌గా ఒక్కొక్క‌రు క‌రోనా భారీన ప‌డుతున్నారు. గత వారం రోజుల నుంచి నలుగురు ఉద్యోగులు మరణించారు. దీంతో సెక్రటేరియట్ ఉద్యోగుల్లో ఒక్క‌సారిగా భ‌యం ప‌ట్టుకుంది. తాము విధుల‌కు రాలేమ‌ని.. త‌మ‌కు వర్క్ ఫ్రం హోం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో క‌రోనా వ‌చ్చేస్తుంద‌ని వారు వాపోతున్నారు. చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారిని క‌రోనా చంపేస్తుంద‌ని ఉద్యోగులు భ‌య‌ప‌డుతున్నారు. నిన్న పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న శాంతకుమారి కరోనాతో మరణించారు. సచివాలయంలో పనిచేస్తున్న ఆమె భర్త కూడా రెండు రోజుల క్రితం కరోనాతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: