దేశంలో క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోన్న టాప్ 30 జిల్లాల్లో ఏపీలోనే ఏడు జిల్లాలో ఉన్న‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. అత్య‌ధిక క్రియాశీల‌క కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే 6వ స్థానంలో నిలిచింది. తెలంగాణ‌లో రోజువారి కేసుల గ్రాఫ్ త‌గ్గుతూ ఉండ‌గా.. 20 %కు పైగా పాజిటివిటీ రేటు న‌మోదు అవుతోన్న 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. ఇక 24 గంట‌ల్లో న‌మోదు అవుతోన్న కేసుల ప‌రంగా చూస్తే ఏపీ ఏకంగా 4వ స్థానంలో ఉంది. దీనిని బ‌ట్టి ఏపీలో క‌రోనా ఉధృతి ఎంత స్పీడ్‌గా ఉందో అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: