కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా సోకి.. సరైన ఆహారం, వసతి లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా బారిన పడి ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని సెక్రటరి మృతిచెందారు. ఈ విషయాని ఆమె స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో.."కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో నా సెక్రటరి మక్రాండ్ మెహతా మరణించారు. నేను 40 ఏళ్ళ నా సహచరుడికి, నా కార్యదర్శి, అంకితభావం, కష్టపడి, అలసిపోని మెహతా జికి వీడ్కోలు పలికాను. అతను నా కుటుంబంలో ఒక భాగం. అతని స్దానం నా జీవితంలో ఎవరు భర్తి చేయలేనిది:.. అంటూ ట్వీట్ చేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి: