1500 కు పైగా సినిమాలకు పీఆర్వో గా సేవలు అందించిన BA రాజు గారి అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి తీవ్ర నిరాశను మిగిల్చింది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అయన చేసిన కృషి అనిర్వచనీయం. గత రాత్రి గుండె పోటుతో BA రాజు కన్ను మూయడం తో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. తాజాగా దర్శకుడు జక్కన్న రాజుగారి మరణం పై స్పందించారు. రాజు గారు మరణ వార్త విని షాక్ కి గురయినట్టు తెలిపారు. పాత్రికేయుడిగా సినిమా పరిశ్రమకు ఎనలేని సేవ చేసిన రాజు గారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు ..ఆయన్ని ఎంతగానో మిస్ అవుతాం అంటూ రాజమౌళి తెలిపారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: