టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి అనుకోని ప్రకటన వెలువడింది.. ఇప్పటికే బాలీవుడ్లో రెండు తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్న ఆయన మూడో సినిమాను కూడా రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది స్టార్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి ఆయన నిర్మించబోతున్నారు.. దీనికి సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితమే వెలువడింది.
ఈ ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో నాంది కూడా ఒకటి. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. అదే సినిమాను హిందీలో ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ అలాగే అజయ్ దేవగన్ ప్రొడక్షన్స్ కలిపి నిర్మించబోతున్నారు. అయితే దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారు ? ఎవరు నటిస్తారు ? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి