సీఎం జ‌గ‌న్‌మెహ‌న్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌లో నిందితులు ముఖ్య‌మంత్రి ఇంటిచుట్టూ తిరుగుతుంటే ప‌ట్టుకోలేని చేత‌గాని ద‌ద్ద‌మ్మ అంటూ ట్విట్ చేశారు. సీఎం జ‌గ‌న్ నివాసానికి కూతవేటు దూరంలోనే గ్యాంగ్ రేప్ జ‌రిగి ప‌ది రోజులు గ‌డుస్తున్న నిందితుల‌ను ప‌ట్టుకోలేద‌న్నారు.శ‌వాల‌పై పేలాలు ఏరుకునేవారిని త‌ల‌ద‌న్నుతూ అత్యాచారాల‌పైనా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కోట్లు దండుకుంటున్నార‌ని లోకేష్ ఆరోపించారు.దిశ యాప్ డౌన్‌లోడ్ పేరుతో సొంత‌ప‌త్రిక‌కు కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌లిచ్చార‌ని...సొంత అక్కాచెల్లెళ్లు ష‌ర్మిల‌,సునీత‌ల‌కే భ‌ద్ర‌త‌లేక ఒక‌రు తెలంగాణ‌లో,ఇంకొక‌రు పోలీసులు చుట్టు తిరుగుతుంటే..అక్క చెల్లెమ్మ‌ల భ‌ద్ర‌త జ‌గ‌నన్న ప్ర‌భుత్వ భాద్య‌త అంటూ ముఖ్య‌మంత్రి క‌ప‌ట ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని ట్వీట్ చేశారుక‌రోనా బాధితుల డిమాండ్ల సాధ‌న‌కు చంద్ర‌బాబు చేప‌ట్టిన దీక్ష‌ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు... 2020 లో ఆమోదం పొంద‌ని దిశ చ‌ట్టం కోసం మ‌రోసారి దిశ యాప్ డౌన్‌లోడ్ కార్య‌క్ర‌మం పెట్టారంటూ విమ‌ర్శ‌లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: