నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ "డెవిల్" అని ప్రకటిస్తూ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది అంటూ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ చర్చనీయాంశంగా మారింది. ఇదే కళ్యాణ్ రామ్ మొదటి పాన్ ఇండియా చిత్రం.

ఇంతవరకూ మిడ్ రేంజ్ బడ్జెట్ మూవీలలో కన్పించిన కళ్యాణ్ రామ్ మొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్ మూవీలో నటించనున్నారు. ఇక ఫస్ట్ కూడా సినిమాపై భారీ అంచనాలని పెంచేసింది. ఈ రోజు కళ్యాణ్ రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు ట్రీట్ గా "డెవిల్" మూవీని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. డెవిల్ సినిమాను బాబు బాగా బిజీ దర్శకుడు నవీన్  మేడారం తెరకెక్కించ పోతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ "బింబిసార" టీం కూడా కళ్యాణ్ రామ్ కు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: