ఈరోజు కూడా సమావేశం లో వైసిపి సభ్యులు గందరగోళం సృష్టించారు అని మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నానీ. కొండపల్లి మున్సిపాలిటీ కి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ హాజరు తీసుకోమని ఆర్.ఒ ఆదేశించగానే... బల్లలు విరగ్గొట్టడం ప్రారంభించారు అని అన్నారు. కోర్టు ఆదేశాలతో జరిగే ఎన్నిక అయినా... అధికారులు వైసిపి కి అనుకూలంగా వ్యవహరించారు అని ఆయన ఆరోపణలు చేసారు.

వైసిపి సభ్యులు ఈ రెండు రోజులు అరాచకం, హడావుడి చేశారు అన్నారు నానీ. ఎన్నికల అధికారి సరైన వివరణ ఇవ్వకుండా ఎన్నిక వాయిదా వేశారు అని తెలిపారు. దీనిపై హైకోర్టు కూడా ఈరోజు అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. రేపు పదిన్నరకు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది అని అన్నారు ఆయన. టిడిపి సభ్యులు కు పూర్తి పోలీసులు భద్రతతో తీసుకురావాలని సూచించింది అని వివరించారు. రేపు అయినా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత తో ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap