వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవొచ్చని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాదు.. వచ్చే మూడు రోజులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీస్తాయతట. వాతావరణం విషయానికి వస్తే రుతుపవన ద్రోణి జైసల్మేర్‌, కోట, సాగర్‌, పెండ్రా రోడ్ గుండా బాలాసోర్‌ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తుందట.


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతోందట. సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరుగుతోందట. అందువల్ల వచ్చే 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చట.


మరింత సమాచారం తెలుసుకోండి: