ఏపీలో ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల కాలం ఉంది. ఇప్పటి నుంచే సమీకరణాలపై చర్చ సాగుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఓ అంచనా ఉన్నా.. బీజేపీ మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు.. జనసేన,మేమూ కలసి పోటీ చేస్తామంటోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 


అధికార వైసీపీ, టీడీపీ రెండూ హిందూ వ్యతిరేక పార్టీలని విమర్శించారు. గుంటూరు కొత్తపేటలో బీజేపీ ప్రజాపోరు నిరసన కార్యక్రమం నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర సహ ఇన్ ఛార్జ్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నింట్లోనూ విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్ అంటించి రాష్ట్రప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని సునీల్ దేవధర్ ఆరోపించారు. అధికార వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు రెండు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని సునీల్ దేవధర్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: