హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలను ట్రాఫిక్ పోలీసులు మరింత కఠినతరం చేసేశారు. అనేక రకాల ఉల్లంఘనలకు జరిమానాలు పెంచారు. వ్యతిరేక దిశలో డ్రైవింగ్  చేసినా ఫైన్ ఉంటుంది.  ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించినా జరిమానా విధిస్తారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే 1700 రూపాయలు జరిమానా ఉంటుంది. అలాగే ట్రిపుల్ రైడింగ్ కు 1200 రూపాయలు జరిమానా విధించనున్నారు.


ఈనెల 28 నుంచి ఈ కొత్త జరిమానా అమల్లోకి వస్తాయి. అప్పటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నియమాలు ఉల్లఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా  ప్రాణ నష్టాన్ని నిరోధించవచ్చని చెబుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లు, ఆపరేషన్ రోప్ వంటివి కేవలం ట్రాఫిక్ నియంత్రణ, వాహనదారుల  భద్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కొత్త జరిమానాలతో జనం జేబులు ఖాళీ కావడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: