భారత్ బ్రహ్మాస్త్రంగా పేరున్న బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు మరింత ఆధునికత సంతరించుకుంది. 290 కిలోమీటర్ల దూరానికే పరిమితమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ను రేంజ్‌ను ఇప్పుడు 400 కిలోమీటర్ల రేంజ్‌కు పెంచారు. తాజాగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించారు. అలా అధునాతన బ్రహ్మోస్ క్షిపణి పరిధి 400 కిలోమీటర్లకు పెరిగింది. ఈ ఏడాది మేలో కూడా సుఖోయ్ యుద్ధ విమానం నుంచి పరిధి విస్తరించిన సూపర్‌సోనిక్ క్షిపణిని భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది.
గతంలో 350కు పెరిగిన పరిధి ఇప్పుడు 400 కిలోమీటర్లకు పెరిగింది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. బ్రహ్మోస్ ఎక్సటెండెడ్ రేంజ్ సామర్థ్యం., సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం సమర్థమైన పనితీరు భారత వైమానిక దళానికి ఒక వ్యూహాత్మక బలాన్ని అందించనున్నాయని తెలిపింది. భవిష్యత్తు యుద్ధాలలో భారత్ ఆధిపత్యం చలాయించడానికి ఈ బ్రహ్మోస్ దోహదపడతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: