తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది.. అంటే చెప్పడం కష్టం అంటోంది ఇండియా టుడే- సీ ఓటర్‌ ఒపినియన్‌ పోల్‌ సర్వే. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ ముందంజలో ఉన్నా.. వచ్చేది హంగ్‌ ప్రభుత్వమేనని ఇండియా టుడే- సీ ఓటర్‌ ఒపినియన్‌ పోల్‌ సర్వే చెబుతోంది. తెలంగాణలో ముక్కోణపు పోరు ఉంది. అయితే..  ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యేనే ఉంది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ జోరు మీద ఉంది. ఆ పార్టీకి 54 సీట్లు వస్తాయట.

ఇక బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ రెండు పార్టీలకూ కలిపితే వచ్చే సీట్లు 57 మాత్రమేనట. అంటే ఇండియా టుడే- సీ ఓటర్‌ ఒపినియన్‌ పోల్‌ సర్వే చెబుతున్న ప్రకారం మేజిక్‌ మార్కుకు మూడు సీట్లు దూరంలోనే ఈ జోడీ ఆగుతుంది. అంటే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా తోసిపుచ్చలేం. బొటాబొటీ మెజారిటీ వస్తే జంపింగ్ జపాంగ్‌లది కీలక పాత్ర అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: