సరిగ్గా ఎన్నికల ముందు రైతుబంధు ఆగిపోయింది. మంత్రి హరీశ్‌రావు మాటలతో అది కాస్తా ఆగిపోయింది. అయితే కాంగ్రెస్ ఫిర్యాదుతోనే రైతుబంధు సొమ్ము ఆగిపోయిందని బీఆర్ఎస్‌ నేతలు చెబుతున్నారు. అయితే.. రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్‌ అడ్డుకోలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అంటున్నారు. కేసీఆర్‌, హరీష్‌రావులు అబద్దాలు చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావు ఎన్నికల నియమావలిని ఉల్లంఘించారన్నారు.


కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మల్లిఖార్జున ఖర్గే అంటున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం అడ్డుకుందని.. లబ్దిదారులకు రైతుబంధు డబ్బులు బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిందన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆరోపించిన మల్లి ఖార్జున ఖర్గే... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: