విశాఖ నగరానికి అద్భుతమైన భవిష్యత్ ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మూడు రోజుల విశాఖ క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రక్షణ పరంగా కూడా విశాఖ మంచి ర్యాంక్ ఉందన్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖ నివాస యోగ్య నగరం, అనకాపల్లి పరిశ్రమలకు అనుకూల ప్రాంతంగా నిర్దేశించారన్నారు. బల్క డ్రగ్ పార్క్ నక్కపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్నారని.. అచ్యుతా పురం దగ్గర లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం వస్తోందని.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని.. డిసెంబర్ 2025 కి భోగాపురం పూర్తి అవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.


డిఫెన్స్ రంగ వస్తువుల తయారీ పార్క్ కూడా విశాఖ లో ఏర్పాటు చేస్తామన్న మంత్రి గుడివాడ అమర్నాథ్... బెంగళూర్ ఇంటర్నేషల్ స్కూల్  కూడా బిమిలి బీచ్ వైపు మార్గంలో వస్తోందన్నారు. కేవలం సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి అంశంలో కూడా మా ప్రభుత్వం దృష్టి పెడుతోందని.. ఈ నగరం మీద నమ్మకం పెట్టుకుని వ్యాపారాలు చేస్తే ఏ నష్టం రాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: