సాధారణంగా పండుగలు అంటే ఆయా రవాణా శాఖవారు ప్రత్యేక ప్రయాణ ఏర్పాటు చేస్తుంటారు. ముందస్తు రిజర్వేషన్స్ కూడా అందుబాటులో ఉంచుతారు. అయితే హైదరాబాద్ మెట్రో కూడా ఈ తరహా ఆఫర్స్ ప్రకటించడం తో ప్రయాణికులకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఈ పండుగ సీజన్ లో(దసరా, దీపావళి, సంక్రాంతి) కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో మరో మూడు ఆఫర్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. అవి ఈ నెల 18 వ తారీకు నుండి 45 రోజులపాటు అందుబాటులో ఉండగలవు. దీనిప్రకారం 20ట్రిప్పులు ప్రయాణించే వాళ్ళు అదనంగా మరో పది ట్రిప్పులు కూడా పయనించవచ్చు అని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి తెలిపారు. ఎంజిబిఎస్-జేబీఎస్ గ్రీన్ లైన్ మార్గంలో 15రూ. మాత్రం చెల్లించి ఒక చివరి నుండి మరో చివరి వరకు ప్రయాణించే సౌలభ్యం కల్పించారు.

ఇక ఆఫర్ల విషయానికి వస్తే, ఇవి ఏ ప్రయాణికుడైన వాడుకోవచ్చు. దీని ప్రకారం అందరు 20 ట్రిప్పులకు నగదు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణం చేయవచ్చు. ఈ సౌలభ్యం 45 రోజుల పాటు ఉంటుంది. అయితే దీనిని పొందటానికి మెట్రో స్మార్ట్ కార్డు(పాత లేదా కొత్త వి) ఉన్నవారు అర్హులు. ఈ ఆఫర్ అక్టోబర్ 18న మొదలై జనవరి 15, 2022 న ముగియనుంది. గ్రీన్ లైన్ ఆఫర్ కింద ఎంజిబిఎస్-జేబీఎస్ మెట్రో స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ఎవరైనా కేవలం 15రూ. చెల్లించి ఒక చివరి నుండి మరో చివరి వరకు ప్రయాణం చేయవచ్చు.
ఈ సౌలభ్యం స్మార్టు కార్డు, సాధారణ టికెట్ కొనుగోలు చేసేవారు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ కూడా జనవరి 15, 2022 వరకు అమలులో ఉంటుంది.

ఇక మెట్రో కూడా నెలనెలా లక్కీ డ్రా తీయడానికి సిద్ధం అయ్యింది. దీనిలో ఎంపిక అయిన వారికి ప్రత్యేక బహుమతి అంటుంది మెట్రో యాజమాన్యం. దానికి వారు అక్టోబర్ 2021 నుండి ఏప్రిల్ 2022 వరకు ప్రతి నెల డ్రా తీయాలని నిర్ణయించారు. నెలలో 20 ట్రిప్పులు కనీసం స్మార్ట్ కార్డు ద్వారా ప్రయాణం చేసిన వారు తమ కార్డు నెంబర్ ఆధారంగా ఈ డ్రా తీయబడుతుంది. అందులో ఐదుగురు విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించనుంది మెట్రో. అవేమిటో బహిర్గతం కాలేదు. ఇందుకోసం ప్రతి ప్రయాణికుడు కూడా తమ కాంటాక్ట్ లెస్ స్మార్డ్ కార్డు ను టి-సవారీ యాప్ లేదా మెట్రో స్టేషన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరమైన వివరాల కోసం మెట్రో స్టేషన్ లో ఉన్న సిబ్బందిని సంప్రదించవచ్చు అని ఎండీ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: