అక్రమ సంబంధాలు మొదట్లో మంచిగానే అనిపిస్తాయి కానీ తర్వాత హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తాయి. పక్కదారి పట్టిన ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు అని ఇప్పటికే ఎన్నో ఘటనలు నిరూపించాయి. కానీ కొందరు కట్టుకున్న భార్యభర్తలను వదిలేసి అక్రమ సంబంధాలకు మరిగి ప్రాణాలను కోల్పోతున్నారు లేదా కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలోని చిన్నాపర గ్రామంలో చోటు చేసుకుంది.


పూర్తి వివరాలు తెలుసుకుంటే.. కర్ణాటక రాష్ట్రం కోలారులోని చిన్నాపర గ్రామానికి చెందిన భానుప్రియా అలియాస్ భవాని అనే 24 ఏళ్ల అమ్మాయి హరీష్ అనే యువకుడితో కొద్ది సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిపించింది. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. వీరి 3ఏళ్ల కాపురానికి ఫలితంగా ఒక పాప పుట్టింది. తమ పాపకు నిధి అని పేరు పెట్టారు. పాప ఆలనా పాలనా చూసుకుంటూ తమ వైవాహిక బంధాన్ని హ్యాపీ గా కొనసాగించారు. ఆ సమయంలోనే వారి మధ్య అక్రమ సంబంధం తిష్ట వేసింది. హరీష్ కోలారు- బెంగళూరు హైవేకి సమీపంలోనే ఉన్న నరాసుపరం ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉద్యోగం చేసేవాడు.



అయితే అదే ప్రాంతంలో ఆయనకు ఒక ఆంటీ పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. హరీష్ ఉదయం ఎప్పుడో ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్ళీ అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకునేవాడు. భార్య భవాని తో కూడా చాలా దూరంగా ఉండేవాడు. దీనితో ఆమెకు అనుమానం వచ్చింది. ఒకరోజు తన భర్త పై నిఘా పెట్టి అసలు విషయం ఏంటో తెలుసుకుంది. ప్రాణంగా ప్రేమించిన తన భర్త ఒక ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకుని తనని మోసం చేస్తున్నాడు అని తెలుసుకొని ఆమె తీవ్ర మనస్థాపానికి గురయింది.



ఇంటికి వచ్చిన తర్వాత పరాయి ఆడదానితో మస్తు మజా చేస్తూ నన్ను మోసం చేస్తావా? అంటూ నిలదీసింది. దీంతో హరీష్ ఆమెపై సీరియస్ అయ్యాడు. నా ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ ఆమెపై తిరగబడ్డాడు. కానీ భవాని ధైర్యంగా హరీష్ ని ఎదిరించింది. దీంతో హరీష్ ఆమెను ప్రతిరోజు టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. వరకట్నం తేవాలంటూ ఆమెకు నరకం చూపించాడు. దీంతో తన భర్త ఇక మారడు అని భావించి భవాని తన రెండేళ్ల పాప మెడకు తాడు బిగించి ప్రాణాలు తీసేసింది. అనంతరం తాను కూడా ఉరేసుకొని మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హరీష్ పై సంబంధిత కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: