కంప్యూటర్ వచ్చి ప్రస్తుతం ప్రతి మనిషి ఆధునిక జీవనశైలిలో మారుతూ  ఉంటే ఇప్పటికి కూడా ఎంతో మంది ఇంకా కనిపించని దయ్యాలు భూతాలు నమ్ముతున్నారు. మూఢనమ్మకాల పేరుతో ఇంకా ఎంతోమంది మోసపోతూనే ఉన్నారు. ఇంకా ఇలా నాగరిక సమాజం లోకి అడుగు పెట్టకుండా మూఢ నమ్మకాలను నమ్ముతున్న జనాల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్న ఎంతో మంది బురిడీ బాబాలు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి   ప్రస్తుతం దేశం మొత్తం అభివృద్ధి పథంలో దూసుకు పోతుంటే ఇంకా కొన్ని గ్రామాలు మూఢనమ్మకాల పేరుతో అనాగరికత వైపు పరుగులు పెడుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


 గతంలో గుప్తనిధుల కోసం కొంత మందిని బలి ఇవ్వడం లాంటి ఘటనలు జరిగాయి అని ఎన్నోసార్లు విన్నాం. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని భూపాలపల్లికి చెందిన వ్యవసాయదారుడు శ్రీనివాస్ అనే వ్యక్తి కి ఒక పెళ్ళిలో ఇక పూజరి షాహీ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇకా ఈ పరిచయం నిమిత్తం షాహీ కుమార్ ఒకరోజు శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. అయితే అప్పుడెప్పుడో ముత్తాతల కాలంలో నిర్మించిన పాత ఇంట్లో ఉంటున్నాడు శ్రీనివాస్. దీంతో ఇక ఈ పాత ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని వెంటనే బయటికి తీయకపోతే కుటుంబసభ్యులకు హాని కలుగుతుంది అంటూ మాయమాటలతో నమ్మించాడు షాహీ కుమార్.


 గుప్త నిధులు బయటకు తీస్తాను అంటూ ఏకంగా 20,000 అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమం కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే గుప్తనిధి కనిపించాలి అంటే ఒక స్త్రీ ని నగ్నంగా ముందు కూర్చోబెట్టాలి అంటూ శ్రీనివాస్ కు చెప్పాడు షాహీ కుమార్.  ఆ స్త్రీ ఆ కుటుంబంలో సభ్యురాలు అయి ఉండాలి అంటూ చెబుతాడు. ఇక ఆ తర్వాత పూజ చేయడానికి వచ్చిన షాహీ కుమార్ పనులు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూజారి అతని సహాయకులు అందరినీ కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఒక దినసరి కూలీ ని నాలుగేళ్ల చిన్నారి ని కూడా రక్షించ గలిగాము అంటూ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: