ఇటీవల కాలంలో మనుషులు మానవ బంధాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు . వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తూ ఉన్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం పరాయి వ్యక్తుల నుంచి మాత్రమే లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు ఆడపిల్లలు. కానీ ఇటీవలి కాలంలో ఏకంగా స్వంత వారు కూడా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఎంతోమంది.


 ఇక ఇటీవలే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అనేది తెలుస్తుంది. సాధారణంగా తండ్రి కూతుర్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. కూతురంటే తండ్రికి.. తండ్రి  అంటే కూతురు కి అమితమైన ప్రేమ ఉంటుంది అని అంటూ ఉంటారు.  కానీ ఇక్కడ ఒక కీచక తండ్రి మాత్రం కన్నకూతురిపైనే కామవాంఛతో రగిలిపోయాడు. ఈక్రమంలోనే భార్య లేని సమయం చూసి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి అభం శుభం తెలియని కూతురును గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వేలూరు జిల్లా విరించిపురం గ్రామానికి చెందిన 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి వెల్డింగ్  పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనికి భార్య ఒక కూతురు ఉంది. అయితే భార్య ఎనిమిదేళ్ల క్రితమే వేరే వ్యక్తి తో వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే భార్య లేకపోవడంతో ఇక 13 ఏళ్ల కుమార్తెపై కామవాంఛను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ఈ కామాంధుడు తాతయ్య ఇంటి నుంచి తండ్రికి భోజనం తీసుకువచ్చే కూతురిపై అత్యాచారానికి పాల్పడటం మొదలు పెట్టాడు. అయితే ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా గర్భవతి అన్న విషయం తేలింది. ఈ క్రమంలోనే వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇక కన్నా తండ్రి కారణం అన్న విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: