
అయితే ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ.. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవాలని లేదా ఎక్కువ లైకులు కావాలి అంటూ ఆశపడుతున్న జనాలు చివరికి సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన వర్షాలు దంచి కొడుతున్నాయ్. ఈ వర్షాలు నేపథ్యంలో ఎక్కడికక్కడ జలపాతాలు పొంగిపొర్లుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక పర్యటకుల తాకిడి కూడా పెరిగింది. అయితే కొంతమంది జాగ్రత్తలు పాటిస్తూనే జలపాతాలను వీక్షిస్తూ.. ఉంటే ఇంకొంతమంది కాస్త అతి చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇక్కడ జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకోవాలనుకున్న ఒక యువకుడి కోరిక చివరికి అతని ప్రాణం పోయే పరిస్థితిని తీసుకొచ్చింది. కర్ణాటకలో యువకుడు శివమొగ్గలోని కొలురు సమీపంలో ఉన్న సిరిడిగండి జలపాతం వద్ద వీడియో తీసి instagram లో పోస్ట్ చేయాలి అనుకున్నాడు. అయితే అతను జలపాతం అంచున వెళ్లి నిలబడ్డాడు. కానీ పొరపాటున ఏకంగా అతని కాలుజారి జలపాతం లో పడిపోయాడు కనీసం అతను జాడ కూడా దొరకలేదు అధికారులు రంగంలోకి దిగి ఆచూకీ కోసం వెతికినా. చివరికి అతను జాడ కనిపించలేదు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాక జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.