ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం, మూలపేట అనే గ్రామంలో ఒక విచిత్ర సంఘట చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఒక చిన్న రామాలయం ఉంది. ఒక ఫ్యాను,  రెండు మూడు లైట్లు తప్ప మరేమి లేని ఆ ఆలయానికి వచ్చిన కరెంటు బిల్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ గ్రామస్థులు. గరిష్టంగా ప్రతినెలా 1000 రూపాయలు కరెంటు బిల్ వచ్చేది ఆ ఆలయానికి. ఏ నెల బిల్లు అదే నెల క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు గ్రామస్థులు. ఎప్పటిలాగానే ఈ నెల కూడా కరెంటు బిల్ వచ్చింది. కానీ ఈసారి వచ్చింది 1000 రూపాయలు కాదు. 4 కోట్ల 19 లక్షల 83 వేల 536 రూపాయలు. ఈ బిల్లు చూసిన ఆ గ్రామస్థులకు ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. ఆగష్టు నెలలో ఆ ఆలయానికి ఒక కోటి 7 లక్షల 37 వేల 455 యూనిట్ల కరెంటు వాడినట్లు చూపించింది ఆ బిల్లు. వెంటనే ఆ బిల్లు తీసుకొని విద్యుత్ శాఖ ఏఈ ని కలిసేందుకు వెళ్లారు ఆలయ నిర్వాహకులు. ఆ బిల్లును పరిశీలించిన ఏఈ, మీటర్ స్కాన్ చేసిన సమయంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని, వెంటనే ఆ బిల్లుని సరిచేసి కొత్త బిల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇటీవలే ఇటువంటి సంఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఒక చిన్న గదిలో ఉంటున్నావు 90 ఏళ్ళ ముసలమ్మకు లక్ష రూపాయల కరెంటు బిల్లు చేతిలో పెట్టింది ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు. ఈ సంఘటన కర్ణాటక లోని కొప్పల్ జిల్లా లో జరిగింది. తన కొడుకుతో కలిసి కొప్పల్ జిల్లా, భాగ్య నగర్ గ్రామానికి చెందిన ఆ పెద్దావిడ ఉంటున్న ఆ గదిలో రెండు బల్బులు మాత్రమే ఉన్నాయ్. కానీ కరెంటు బిల్లు మాత్రం ఏదో పెద్ద షాపింగ్ మాల్ కు వచ్చినంత వచ్చింది. ఇది చూసి ఆ ఊరంతా అవాక్కయ్యింది. ఇంత డబ్బు తానెలా కట్టేది అని వాపోయింది ఆ ముసలావిడ. ఈ విషయం తెలిసిన అధికారులు ఆమె ఇంటికి వచ్చి మీటర్ చెక్ చేసారు. టెక్నికల్ సమస్య వలెనే ఇలా జరిగిందని, ఆమె అంత డబ్బు కట్టవలసిన పని లేదని భరోసా ఇచ్చారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: