
పంట నష్టరిహారం లేదు .. మద్దతు ధర లేదు.. పండించిన పంట ను అమ్ముకొలేని దుస్థితిలో రైతులు ఉన్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. రైతుబంధులో అనర్హులు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసన్న పొన్నాల లక్ష్మయ్య.. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో దేశంలో జాతీయ పార్టీ అంటూ బయలు దేరాడని మండిపడ్డారు. కేసీఆర్ జాతీయ పార్టీ దేశంలో దోపిడీ కోసమేనని.. రాష్ట్రంలో ఎన్నికల హామీలు అమలు చేయలేదని దేశంలో చెబుతారా అని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.
కాళేశ్వరం తో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో చెప్పగలవా అని నిలదీసిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. విద్యుత్ కొనుగోళ్ళ పై సర్కార్ పెద్దలు చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్న పొన్నాల లక్ష్మయ్య.. ధరణి పోర్టల్ ఫెయిల్యూర్ కేసీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో చెబుతున్న ఐటి హబ్ లు అన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తెచ్చారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
తెలంగాణకు ఏమీ చేయలేని బీజేపీ నాయకులు .. ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారన్న పొన్నాల లక్ష్మయ్య... విభజన హామీలు ఒక్కటైన అమలు చేశారా అని బీజేపీని నేతలను ప్రశ్నించారు. ప్రభుత్వాలను కూల్చే బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని.. రాష్ట్రంలో బీజేపీ బలమెంతో ప్రజలకు తెలుసు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీజేపీ 90 సీట్లు అనే కంటే 119 అంటే బాగుండని పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.