
అయితే జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై...పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఫైర్ అయిన విషయం తెలిసిందే..అదే సమయంలో టీడీపీ శ్రేణులు సైతం...పవన్‌కు సపోర్ట్‌గా నిలిచాయి..అలాగే చంద్రబాబు, లోకేష్‌లు సైతం పవన్‌కు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు..ఇలా చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఒక సినిమా విషయంపై మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీ శ్రేణులు ఏదో జగన్ ప్రభుత్వంపై కోపంతో పవన్‌కు సపోర్ట్ చేసి ఉంటాయి. ఓవరాల్ గా టీడీపీ కీలక నేతలు, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అందరూ కూడా పవన్ సి నిమాకు సపోర్ట్‌గా వ్యాఖ్యలు చేయడం లేదా సోషల్ మీడియాలో స్పందించడం చేశారు.
అలాంటిది రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్లు చంద్రబాబు, లోకేష్‌లు సైతం సినిమా కోసం మాట్లాడటం కరెక్ట్‌గా లేదని అంటున్నారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు సైతం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కోసం చిరంజీవి మాట్లాడలేదని, అలాగే టీడీపీ అంటే విషం చిమ్మే నాగబాబు స్పందించలేదని, అటు కొందరు కాపు మేధావుల ముసుగులో ఉండే వారు స్పందించలేదని, చివరికి జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా స్పందించలేదన్న టాక్ ఉంది.
అలాంటప్పుడు పవన్ సినిమాకు సపోర్ట్‌గా చంద్రబాబు, లోకేష్‌లు పనిగట్టుకుని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముందని కొందరు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జనసేనతో పొత్తుకు టీడీపీ ముందుకొస్తే 10 సీట్లు పడేస్తామనే వారికి మద్ధతుగా నిలబడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. అంటే టీడీపీలోనే పవన్‌కు సపోర్ట్ ఇచ్చేవారు...వ్యతిరేకించే వారు ఉన్నట్లు కనిపిస్తున్నారు.