ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలను సర్వే చేసినపుడు వారు చెప్పిన అభిప్రాయం ప్రకారం.. ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ నెంబర్ 1 అని తేల్చారు. గ్లోబల్ లీడర్స్ ఆఫ్ ప్లురల్ రేటింగ్ లో వరుసగా రెండో సారి ఆయన నెంబర్ 1 గా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 72 శాతం మంది మోడీని ప్రపంచ లీడర్ గా గుర్తించారు. రెండో స్థానంలో మెక్సికో ప్రెసిడెంట్ 68 శాతం, మూడో స్థానంలో స్విట్జర్లాండ్ 62 శాతం, ఆస్ట్రేలియా 58 శాతంతో నాలుగో స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు 50 శాతంతో అయిదో స్థానంలో నిలిచారు.  


నెంబర్ వన్ ప్రపంచ నాయకుడిగా మోడీ రెండో సారి నిలవడం నిజంగా గర్వకారణం. కానీ ఇది చాలా మందికి ఇక్కడ ఉన్న వారికి ఇది నచ్చదు. ఇదంతా నార్మల్ సాంపుల్స్ 30, 40 వేల మంది అభిప్రాయాలతో ఎలా చెబుతారు అని కొందరు వింత వాదన చేస్తుంటారు. అదే ముప్పై, నలబై వేల మంది ఓటు వేసి నెంబర్ వన్ అని చెబితే అదంతా ఒట్టి మాట అని కొట్టి పారేస్తున్నారు.


ఏది ఏమైనా భారత్ నుంచి మోడీ నెంబర్ 1 గా రెండో సారి నిలవడం సంతోషకరమైన అంశం. ప్రపంచ దేశాల్లో ఉండే వారు ఇండియాలో ఏం జరుగుతోంది. ఎవరి పాలనలో ప్రజలు ఎలా ఉంటున్నారనే విషయాలను అన్నింటిని నిశితంగా గమనిస్తూనే ఉంటారు. ఇదే ఓటింగ్ లో మోడీకి తక్కువ మార్కులు వస్తే  ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారే నిలదీసి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యే వారు. మరి ఇదే విషయంలో భారత్ లో ఉన్న వ్యాపార దిగ్గజం అదానీ గురించి ఎక్కడో డెన్మార్క్ లో ఉన్న హిండెన్ బర్గ్ ఒక నివేదిక పంపితే అది నిజమని వాదించే వారు కూడా ఉన్నారు కదా. మనకు నచ్చితే ఒక తరహా.. నచ్చకపోతే మరో తరహా అనడం కరెక్టు కాదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: