ద్రవ్యోల్బణం, దానిలోని మార్పు మనకు బాగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దానిలో వచ్చే మార్పు మన నిత్య జీవితంలోని నిత్య అవసరాలపై పడుతుంది. దానివల్ల మనం అందరం నిత్యం ప్రభావితం అవుతూ ఉంటాం. మనం నిత్యం వాడే నూనెల ధరలు 200 రూపాయల దాకా వెళ్ళిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే పప్పుల ధరలు కూడా 150 నుండి 200-250 దాకా వెళ్ళిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.


నిత్యవసర ధరల్లో వచ్చే ఈ పెను మార్పులు వల్ల గతంలో ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగిపోవడానికి కారణం కూడా ఈ ద్రవ్యోల్బణం అయ్యింది. ఆయన ఉండగా వీటి ధరలన్నీ 200 రూపాయలు నుండి 300 రూపాయలు దాకా వెళ్ళిపోయాయి. అందుకే అప్పుడు ఆయన దిగిపోయారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక అలా పెరిగిన ధరలన్నింటిని దారిలోకి తెచ్చాడు.


కానీ మళ్ళీ తాజాగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంక్షోభం ఫలితంగా ప్రపంచ దేశాలన్నింటిమీద చాలా వరకు చాలా రకాలుగా పెను మార్పులు వచ్చాయి. అందులో చాలా దేశాలలో మాదిరిగానే భారత దేశంలో కూడా ఈ ద్రవ్యోల్బణం రేటు పెరగడం అనేది కూడా ఒకటి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఇక్కడ ద్రవ్యోల్బణం రేటు 8.1 దాకా వెళ్లి కొన్ని ట్యాక్స్ లు తగ్గించడం వల్ల మళ్ళీ తగ్గుతూ వచ్చింది.


తాజాగా ఇప్పుడు ద్రవ్యోల్బణం రేటు దారికి వచ్చిందని ఐఎంఎఫ్ లెక్క చెప్తుంది. గత సంవత్సరం 6.8 పర్సెంట్ గా ఉన్న ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం 5 పర్సెంట్ గా ఉండబోతున్నట్లు లెక్క చెప్తుంది. ఈ ద్రవ్యోల్బణం రేటు వచ్చే సంవత్సరం ఇంకా బాగా తగ్గిపోయి 4 పర్సెంట్ గా ఉండబోతున్నట్లుగా అంచనా వేస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్లో 27 పర్సెంట్ గా ఉన్న  ద్రవ్యోల్బణం రేటు 32 పర్సెంట్ దాకా పెరిగే  ప్రమాదం ఉందని లెక్క కడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: