
అవి దేనికీ పనికి రావు, అంటే యుద్ధం చేయడానికి కూడా పనికి రావు. ఎందుకంటే అవి కేవలం డమ్మీనే కాబట్టి. కానీ అవి ఉక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల్లో అంటే డొనేట్స్ కీ, లుపాన్స్ కీ, జెపోరీజియా అలాగే క్యార్సన్, బాగ్పుత్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో పెడుతున్నారట. సాధారణంగా రష్యన్ మిస్సైల్స్ ఏం చేస్తాయి? అవి టార్గెట్ చేసుకొని అటాక్ చేస్తాయి. అయితే ఈ ఉక్రెయిన్ వాళ్ళు అవతలి వాళ్ళ రాడార్లకు కూడా ఇవి అందే విధంగా చూస్తున్నారట.
ఈ డూప్లికేట్స్ వాటికి కొద్ది దూరంలో అసలైన ఎక్విప్మెంట్ పెడుతున్నారట. పైన ఉండే సాటిలైట్స్ నుండి చూసినప్పుడు వాళ్ళకి ఈ డూప్లికేట్స్ కనపడతాయి. అప్పుడు వీటి మీదకి ఎటాక్ చేయబోయే సరికి, వాటి వెనకాల ఉన్న ఒరిజినల్స్ ఎటాక్ చేస్తాయి. ఇంతకుముందు రష్యాకు సంబంధించిన కొంతమంది సైనికులు ఎలా చనిపోయారు, కొన్ని విమానాలు ఎలా కూలిపోయాయి అంటే ఈ విధంగానే అని తెలుస్తుంది. డమ్మీ వాటి దగ్గరకు వచ్చి కాల్పులు జరుపుతుంటే, అసలు దాని నుంచి వచ్చి ఎటాక్ చేయడం వలన ఈ విధంగా చనిపోయారని తెలుస్తుంది. ఈ విధంగా ఉక్రెయిన్ రష్యా సైన్యాన్ని ఫూల్స్ చేస్తుందన్న విషయం తాజాగా బయట పడింది.