
ఏకంగా 350 కోట్ల రూపాయాల అవినీతిలో చంద్రబాబు హస్తం ఉన్నట్లు వైసీపీ ఆరోపిస్తుంది. కానీ చంద్రబాబును ఒక్క మాట కూడా పవన్ విమర్శించడం లేదు. పవన్ కేవలం వైసీపీని మాత్రమే విమర్శిస్తూ చంద్రబాబును వెనక్కి వేసుకొస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది.
జగన్ కూడా ఇదే విషయంలో పేరు ప్రస్తావించకుండా దత్తపుత్రుడు ప్రశ్నించడం మానేసాడా అన్న ప్రశ్నలను సంధించాడు. ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతా అని గతంలో అన్న పవన్ మొన్న జరిగిన బహిరంగ సభలో మాత్రం నన్ను వెయ్యి కోట్లకు అమ్ముడు పోయారని ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అన్నారు. మాట తీరులో ఆవేశంలో కూడా తేడా కనిపించింది. ఒక పత్రిక వెయ్యి కోట్లకు పవన్ ప్యాకేజీ అని వార్తలు రాసిన తర్వాత తీవ్ర విమర్శలు చేయకుండా నామామాత్రంగానే స్పందించారు. ఇలా ఒకరు విమర్శిస్తే వారిపై బూతులు తిట్టడం, చెప్పులు చూపించడం చేస్తూ, మరో మీడియా సంస్థ కానీ అనుకూలమైన వ్యక్తులు తప్పు చేశారని ఆరోపణలు వచ్చినపుడు స్పందించకపోవడం అనేది దారుణం.
అసెంబ్లీలో జరిగిన గొడవపై వీడియో రిలీజ్ చేయకపోవడంపై వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం గురించి ఆర్థిక శాఖ కార్యదర్శి ఏకంగా చంద్రబాబు చేయమంటేనే సంతకం చేశామని చెప్పుకొచ్చినా పవన్ స్పందించలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షమైన వైసీపీనే పవన్ విమర్శించారని ప్యాను పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.