ప్రధాని మోదీ ఎవరకీ ఏం  చెప్పరు.. తన పని తాను చేస్తూ పోతుంటారు.  కేంద్రమంత్రి వర్గంలో ఎవరినీ అయినా తొలగించినా.. లేక తీసుకున్నా చివరి క్షణం ఆ వ్యక్తి కి సైతం తెలియనివ్వకుండా గోప్యత పాటిస్తారు.  కేంద్రం తీసుకునే నిర్ణయాలు చివరి వరకూ ప్రతిపక్షాలకు కాదు కదా క్యాబినెట్ కు కూడా తెలియనివ్వరు.


కానీ మోదీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే భయం మాత్రం విపక్షాలను వెంటాడుతూనే ఉంటుంది. అనూహ్యంగా తీసుకొచ్చిన ఆర్టికల్ 370 రద్దు ఒక ఎత్తు అయితే 2000 నోట్ల రద్దు మరో ఎత్తు. వీటితో పాటు దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలను చాలా చాకచక్యంగా తీసుకుంటారు.  దీనికి ఉదాహరణే మహిళా రిజర్వేషన్ బిల్లు.


బీజేపికి మహిళా నాయకురాళ్లు తక్కువగా ఉన్నా కూడా.. ఎన్నికలకు కేవలం కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్నా తెగించి ఈ బిల్లు తీసుకువచ్చారు. గతంలో జీఎస్టీ వాటి వల్ల పార్టీకి లాభం చేకూరింది.  అయితే దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల్లో మహిళా బిల్లు ఒకటి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇంకేం నిర్ణయం ప్రకటిస్తారో అని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అందులో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం ఒకటి. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ ప్రభావం ఆంధ్రా రాజకీయాలపై కూడా పడుతోంది. యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తే దానికి విపక్షాల వద్ద సరైన సమాధానం ఉండదు.  ప్రజల్లో కూడా సానుభూతి పెరుగుతుంది.


దీంతో పాటు పీవోకే పై తీర్మానం చేస్తే మరో కీలకమైన పరిమాణం అవుతోంది. ఇప్పటికే జమిలి, ముందస్తు ఎన్నికలు అనే అంశంపై ప్రకటన చేస్తారు అని భావిస్తున్న ప్రతిపక్షాలు మరే నిర్ణయం ప్రకటిస్తారో అర్థం కావడం లేదు. దీంతో మోదీ ఏం చేస్తారో తెలియక తలలు పట్టుకోవడం అపర మేధావులైన ఇండియా కూటమి నేతల పని అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: