ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయితీ నెలకొంది. టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది.  ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఇది తెలంగాణ, మరే ఇతర రాష్ట్రాల్లో అయితే హాట్ టాపిక్ కాదు.  ఏపీలో అయితే .. నిజంగా ఇది ఆశ్చర్యపడాల్సిన అంశమే మరి.  పార్టీలో కష్టపడిన పడిన వారికి టికెట్లు ఇవ్వడం లేదని ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపలేని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా షర్మిళ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆ పార్టీలో జవసత్వాలు నింపి ఆ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో అసంతృప్త వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకొని వారికి టికెట్లు కేటాయిస్తున్నారు. జగన్ పై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఆ పార్టీలో టికెట్ల రచ్చ నడుస్తోంది.


ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్ లో ఉంది. టికెట్ దక్కని పలువురు నేతలు ఆందోళనలు, తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ను ఇదే సీన్ రిపీట్ అయింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇండియా  కూటమి నాయకులతో గిడుగు రుద్రరాజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వచ్చిన అనపర్తి, రాజా నగరం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. గిడుడు రుద్రరాజు సమక్షంలోనే తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అయితే ఆయన మాత్రం అందర్నీ కలుపుకొని వెళ్తామని హామీ ఇచ్చారు. ప్రచారం కోసం పలువురి నేతలను తీసుకువస్తామని.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సీట్ల కోసం నిజంగానే గొడవపడే స్థాయికి కాంగ్రెస్ వెళ్లిందా లేక.. ట్రిక్స్ ఏమైనా ప్లే చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: