విశాఖలో టిడిపి కూటమి డిప్యూటీ మేయర్ పదవిని కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ వన్ పదవి కోసం గత నెలలో నోటీసులు ఇస్తే శనివారం దానిమీద ప్రత్యేక సమావేశం జరిగింది. కూటమికి చెందిన వారే సమావేశానికి వచ్చి ఓటు వేశారు .. మ్యాజిక్ ఫిగర్ అందుకున్నారు .. సక్సెస్ఫుల్గా వైసిపి డిప్యూటీ మేయర్ ని కిందకి దించేశారు. డిప్యూటీ మేయర్ పదవి కూటమి లో ఎవరికి ? దక్కుతుంది అన్నది ఇప్పుడు బిగ్ డిబేట్ గా ఉంది. మేయర్ గా టిడిపికి చెందిన పీలా శ్రీనివాస్ పేరుని ఎంపిక చేశారు అని తెలుస్తుంది. ఆ లెక్కన డిప్యూటీ మేరు పదవి జనసేనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ రేసులోకి తమ్ముళ్లు దూసుకుని వస్తున్నారు. తమకు ఆశలు ఉన్నాయని చెబుతున్నారు. తాము ఈ పదవిని అందుకుంటామని అనేకమంది పోటీపడుతున్నారు.
పార్టీలో ఉన్న వారే కాకుండా కొత్తగా పార్టీ ఫిరాయించి వచ్చి చేరిన నేతల కన్ను కూడా ఈ కీలకమైన పదవి మీద పడింది. కూటమి లో అత్యధిక నెంబర్ టిడిపికే ఉందని వారు ఉంటున్నారు. అందువలన మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ ని తామే చేపట్టాలని అంటున్నారు. జనసేనకు డిప్యూటీ మేయర్ అని ఎంతకాలం ప్రచారంలో ఉన్న విషయం ఇప్పుడు అవిశ్వాస అవసరం తీరింది .. కాబట్టి జనసేన పక్కకు జరిపి టిడిపి తమ్ముళ్లు ముందుకు వస్తున్నారని అంటున్నారు. డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకపోతే కూటమి లో చిచ్చు రేగుతుంది అని అంటున్నారు. జనసేనకు ఇవ్వకుండా మేయర్ డిప్యూటీ రెండు టిడిపి యే తీసుకుంటే రాజకీయం రంజు జిగా మారుతుంది. జీవీఎంసీలో తొందర్లోనే ఈ రెండు పదవులకు ఎంపిక జరగనుంది. అప్పుడు జనసేన రాజకీయ జాతకం ఎలా ఉండబోతుందో తెలవనుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు