
క్రెడాయ్ సంస్థకు కీలకమైనవి.. అమరావతి అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి నారాయణ అన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పనకు దోహదపడుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల జీవోలను పరిశీలించి క్రెడాయ్ డిమాండ్లలో చాలావరకు అమలు చేశామని, బిల్డర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రెడాయ్‌కు అన్ని విధాల సహకారం అందిస్తుందని ధృవీకరించారు.
మంత్రి నారాయణ నెల్లూరు జిల్లా కావలిలో నిర్మాణ ఉల్లంఘనలపై పరిశీలన జరుగుతున్నట్లు వెల్లడించారు. కావలిలో 75 శాతం నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలిందని, నెల్లూరు ఉడా పరిధిలో ఇలాంటి ఉల్లంఘనలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా అనుమతులు ఇస్తున్నామని, అధికారులతో కలిసి ఈ ఉల్లంఘనలను సమగ్రంగా తేల్చుతున్నామని పేర్కొన్నారు. మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్లను సమీక్షించాలని నిర్ణయించామని వివరించారు.
గత ఐదేళ్లలో ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, పది లక్షల కోట్ల అప్పు సృష్టించినట్లు సీఎం తెలిపారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి రెండు కళ్ల వంటివని, అభివృద్ధి ద్వారానే ఆదాయం సమకూరుతుందని ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని, ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు