
ఆక్రమణల వెనుక ప్రభావవంతమైన వ్యక్తులు ఉంటారని, వారు పేదలను ముందుంచి తప్పించుకుంటున్నారని రంగనాథ్ ఆరోపించారు. రూ.40 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని ఆక్రమించే ధైర్యం పేదలకు ఉండదని, ఈ విషయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని విమర్శించారు. హైడ్రా పేదలపై పగపట్టిందనే ఆరోపణలను ఖండించారు. మూసీ నదికి సంబంధం లేని అంశాలను కూడా హైడ్రాతో ముడిపెట్టి విమర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఓవైసీ కళాశాల విషయంలో హైడ్రా నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించినట్లు రంగనాథ్ తెలిపారు. ఈ కళాశాల 2015-16లో నిర్మితమైందని, సల్కం చెరువు ప్రాంతానికి 2016లో నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ తుది నోటిఫికేషన్ ఇంకా రాలేదని వివరించారు.
నగరంలోని 80 శాతం చెరువులకు తుది నోటిఫికేషన్ లేనట్లు ఆయన పేర్కొన్నారు. ఓవైసీ కళాశాలపై పదేపదే ప్రశ్నలు ఎందుకని రంగనాథ్ సందేహం వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలు నిష్పక్షపాతంగా ఉంటాయని, ఆక్రమణలను అరికట్టడంలో ఎట్టి రాజీ లేదని స్పష్టం చేశారు.హైడ్రా ఏడాది కాలంలో మంచి, చెడు అనుభవాలను ఎదుర్కొందని రంగనాథ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణపై హైడ్రా దృష్టి సారించిందని తెలిపారు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడడం ద్వారా నగర భవిష్యత్తును సురక్షితం చేస్తున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయని, ఈ దిశలో పనిచేయడం కొనసాగిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు