
ప్రస్తుతం ప్రపంచదేశాల్లోనూ కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన కరోనావైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. భారత్‌లో కూడా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే కరోనా కష్టంలోనూ ఇంటర్మీడియట్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా.. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది.
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 256 ఖాళీలు ప్రకటించింది. గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు చూస్తే.. మొత్తం 256 ఖాళీలు ఉండగా.. అందులో ఫ్లయింగ్ బ్రాంచ్- 74, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 105, గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)- 55, మెటరాలజీ- 22 పోస్టులున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఇక అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఇందులో ఎంపికైనవారికి హైదరాబాద్‌లోని దుండిగల్‌లో గల ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే రూ.250 ఫీజు చల్లించాలి. పెళ్లికాని యువతీయువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://afcat.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ 2020 జూన్ 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 14 చివరి తేదీ. అసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 జూలైలో శిక్షణ ప్రారంభం అవుతుంది. 2020 సెప్టెంబర్ 4న అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. 2020 సెప్టెంబర్ 19న పరీక్ష జరుగుతుంది.