
2023 లెక్కల ప్రకారం దాదాపు 1700 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్ లో డాక్టర్ చదువు చదవడానికి వెళ్లారు . వైద్య విద్య కోసం ఎక్కువగా ఇరాన్ దేశాన్ని ఎంచుకుంటూ ఉండడం గమనార్హం . అసలు ఎందుకు ఇరాన్నే ఎక్కువగా స్టూడెంట్స్ వైద్య విద్య కోసం చూస్ చేసుకుంటున్నారు అనే విషయం గురించి రీసెర్చ్ చేయగా స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఆన్సర్ అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . నీట్ - యూజీ 2025 పరీక్షకు విద్యార్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు . వాళ్ళల్లో 1.1 లక్షల ఎంబిబిఎస్ సీట్లకు 22 లక్షల మంది పరీక్ష రాశారు .
గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లు కేవలం 85000 మాత్రమే . ఇక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరూ ఆశలు వదులుకోలేక విదేశాల బాటపడుతూ తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు . అయితే వీళ్ళలో ఎక్కువగా వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్తూ ఉన్నకారణంగా.. దీని గురించి స్టూడెంట్స్ ని ప్రశ్నించగా ఇండియాలో అయితే డాక్టర్ చదవాలి అంటే చాలా చాలా ఖర్చు అవుతుంది అని అంత ఖర్చు భరించలేక ఇరాన్ కి వస్తున్నామని చెప్పుకొచ్చారు . అంతేకాదు అక్కడ మౌలిక సదుపాయాలు కూడా బాగుంటాయి అని ..దానికి తగ్గట్టే ఇతర ప్రవేశ పరీక్షలకు కూడా ట్రైన్ చేస్తారు అని చెప్పుకొస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఇండియా తో కంపేర్ చేస్తే ఇరాన్లో కోర్స్ సమయం ఎక్కువగా ఉన్న మంచి ప్రిపరేషన్ ఇస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. ఆ కారణంగానే ఇండియాను వదిలి ఇరాన్ లో చదువుకోవడానికి వచ్చాము అని కూడా కొంతమంది స్టూడెంట్స్ ఓపెన్గానే తమ ప్రాబ్లం ని బయటపెట్టారు. అయితే విదేశాలలో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చాక నేరుగా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి వీల్లేదు . ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష ఖచ్చితంగా రాయాలి . అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఇందులో పాస్ అయితేనే ప్రాక్టీస్ పెట్టుకునేందుకు అనుమతి ఇస్తారు . అక్కడికి వెళ్లడానికి మరొక కారణం కూడా ఉంది . అక్కడ కోర్స్ సిలబస్ దాదాపు ఇండియా సిలబస్తో పోలి ఉంటుంది . కాలవ్యవధి ఎక్కువ అయినా సిలబస్ మాత్రం ఒకేలా ఉంటుంది . దానికి తగ్గట్టు తక్కువ ఫీజు పైగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి . దానికి తగ్గట్టే ఎక్స్ట్రా ప్రిపరేషన్ ఆ కారణంగానే జనాలు వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారట..!!