గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 3వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ప్ర‌ముఖుల  జ‌న‌నాలు..

1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.ద్యుతీ చంద్ భారతదేశానికి చెందిన ఒక పరుగుపందెం క్రీడాకారిణి. 36 సంవత్సరాల తర్వాత ఈవిడ మనదేశం నుండి 2016 రియో ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొనడానికి అర్హత సాధించింది. జాతీయ స్థాయిలో ఆమె అత్యుత్తమ రికార్డు 11.24 సెకన్లు కావడం గమనార్హం. 1980లో పీటీ ఉష తర్వాత 100మీ. డ్యాష్‌లో 36 ఏళ్ల తర్వాత భారత్‌ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి అథ్లెట్‌ ద్యుతీచంద్‌.

ప్ర‌ముఖుల మరణాలు

1924: అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
1975: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873). ఆయన X-కిరణం యంత్రాలపై అనేక ప్రయోగాలు చేశారు. ఆయన జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ లాబొరేటరీకి డైరక్టర్గా పనిచేశారు, కార్పొరేషన్ కు ఉపాధ్యక్షునిగా కూడా ఉన్నారు. ఆయన "సాగేగుణం గల టంగ్‌స్టన్"ను అభివృద్ధిచేయడంలో ప్రసిద్ధి పొందాడు
2002: కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)అతను అసలు పేరు కొమ్మినేని అప్పారావు. అతను దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. అతను 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. అమ్మోరు చిత్రానికి చివరి సారిగా సంగీతాన్ని అందించిన చక్రవర్తి 2002 ఫిబ్రవరి 3న కన్నుమూశారు. అతను శిష్యుడు ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ అవార్డు పొందాడు. చక్రవర్తి రెండవ కుమారుడు అయిన శ్రీ సినీ సంగీత రంగంలో పనిచేస్తున్నాడు.
2012 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. (జ.1960)
2016:: బలరామ్ జక్కర్, రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)

మరింత సమాచారం తెలుసుకోండి: