కంటి ఆరోగ్యం మెరుగు పడాలంటే విటమిన్ ఏ తో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల కళ్ళలోని కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా క్యారెట్లు, ఎరుపురంగు క్యాప్సికం, బ్రోకలీ, పాలకూర, స్ట్రాబెర్రీలు, చిలకడదుంప, నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల కంటి చూపు మెరుగుపడి,కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.