ఎండాకాలం వచ్చేసింది.. మండుతున్న సూర్యుడి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవాలంటే మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలి. అందుకు తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. శరీరాన్ని తేమతో ఉంచడానికి శరీరానికి ఎప్పటికప్పుడు నీటిశాతాన్ని పెంచుతూ ఉండాలి. అందులో భాగంగానే ఎక్కువగా రోజుకు 6 నుండి 7 లీటర్ల నీటిని కంపల్సరిగా తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అయితే నీళ్లు తాగలేము అనుకునేవారు కొన్ని తాజా పండ్ల రసాలు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయని నిపుణులు అంటున్నారు.