కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీళ్లు, ఎలక్ట్రోలైట్ వాటర్, కొబ్బరి నీళ్లు, అల్లం తో తయారు చేసిన టీ, తాజా పండ్లు వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గడంతో పాటు శరీరానికి శక్తి కూడా లభిస్తుంది..అంతే కాకుండా కోడిగుడ్లు,అరటి పండ్లు, అన్నం, ఆపిల్ సాస్, టోస్ట్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో అధిక మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి కావలసిన శక్తిని అందించడంతోపాటు వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.