అయితే ఇటీవల కాలంలో చాలా చోట్ల ,ఎవరో ఒకరు బాత్రూంలో ప్రాణాలను కోల్పోయారు అనే వార్తను ఎక్కడో ఒకచోట వింటూనే ఉన్నాం.. ఇందుకు కారణం మనలో కొంతమంది నిద్రలేవగానే హుటాహుటిన టాయిలెట్ కి వెళుతూ ఉంటారు. అలా అర్జెంట్ గా వచ్చేదాకా ఆగకుండా, లేచిన వెంటనే పరిగెత్తుకుంటూ, మెలుకువ రాగానే లేవకుండా, ఒక అర నిమిషం పాటు అలాగే ఉండాలి. మరో రెండు నిమిషాలు లేచి ,బెడ్ మీద కూర్చుని ,కాళ్లు కిందకు పెట్టి ఉంచాలి. ఇక ఆ తరువాత బాత్ రూం కి వెళ్ళవచ్చు. ఇలా మూడు నిమిషాల సమయాన్ని మీరు కేటాయించినట్లు అయితే మృత్యువు నుంచి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవచ్చని అంటున్నారు గుండె సంబంధిత నిపుణులు.