మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్.. దీన్నే సింపుల్ గా MIS-C అంటున్నారు. ఇది పిల్లలకు సోకుతున్న వ్యాధి. కరోనా నుంచి కోలుకున్న 15 ఏళ్ల పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఇది సోకినప్పుడు శరీరంలో వివిధ భాగాల్లో మంట పుడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, చర్మం, కళ్ళు ఇలా మిగతా అవయవాలలో మంట వస్తుంది.