మిరియాలు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. ఇక ఇది ఘాటయిన వాసన కలిగి ఉండటం వల్ల ఇది శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని మిరియాలు తీసుకుని దోరగా వేయించి, వాటిని పొడిగా చేసి, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి మిశ్రమం, ఒక గ్లాసు మంచినీరు, వీటన్నిటినీ మరిగించి అందులో కొంచెం తేనె వేసుకుని, రోజులో రెండు మూడు సార్లు ఈ ద్రావణాన్ని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి.