పాలగుండ.. దీని గురించి చాలామందికి పెద్దగా తెలిసి ఉండదు.. పూర్వ కాలంలో ఎక్కువగా శరీర చల్లదనం కోసం ఈ పాలగుండను ఉపయోగించేవారు.. ఇది కేవలం మన దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా ఉపయోగించేవారు. అయితే ఈ పాలగుండ  ఒక పిండి పదార్థం. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

పాలగుండలో కార్బోహైడ్రేట్లు,విటమిన్ బి, కాల్షియం, పొటాషియం,మెగ్నీషియం,సోడియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా జింక్, ఐరన్, విటమిన్ బి 1,విటమిన్ బి 6, సాచ్యురేటెడ్, అన్శాచురేటెడ్  కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండడం వల్ల ఫ్యాట్ పెరిగే అవకాశం కూడా ఉండదు. ఇక వీటిలో ఫైబర్ తో పాటు ప్రోటీన్లు,అలాగే లిపిడ్లు కూడా ఉంటాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు బలహీనత, అలసట, రుగ్మతలతో పోరాడడానికి సహాయపడతాయి. ఆక్సిజనేషన్ క్రియ సమర్థవంతంగా ఉండడానికి దోహదపడుతుంది.

మూత్రాశయ ఇన్ఫెక్షన్ లతోపాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి పాలగుండ ఎంతగానో ఉపయోగపడుతుంది.

కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఆరోగ్యకరమైన మోతాదు కలిగిన ఫైబర్ ఇందులో ఉండటంవల్ల, క్రమంగా బరువు తగ్గవచ్చు.

కడుపులో వచ్చే అన్ని సమస్యలకు గుడ్ బై చెప్పే శక్తి ఈ పాలగుండకు ఉంది. మరీ ముఖ్యంగా ఉదరకుహర వ్యాధి అన్నిచోట్ల ఎదుర్కొంటున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా  దీని బారిన పడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. కాబట్టి పిండి పదార్థాలు ఉపయోగించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక అందుకే గ్లూటిన్ లేని పదార్థం అవ్వడం వల్ల ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలో, నొప్పిని తగ్గించడంలో పాలగుండ ఎంతగానో ఉపయోగపడుతుంది.

విటమిన్ బి లలో ఫోలేట్ చాలా ముఖ్యమైనది. ఇది పాలగుండలో అధిక స్థాయిలో ఉంటుంది. గర్భవతులకు ఫోలేట్ చాలా ముఖ్యమైన పోషకపదార్థం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ఫోలెట్ అవసరమవుతుంది. అలాగే డిఎన్ఏ సంశ్లేషణ తో పాటు ఆరోగ్యకరమైన కణవిభజన లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: