బరువు తగ్గడానికి అల్లం, నిమ్మరసం చాలా ఉపయోగపడతాయి. అది ఎలాగంటే ఒక గ్లాసు నీటిలో అల్లం వేసుకొని అందులోకి కొంచెం నిమ్మరసం కలిపి తాగుతూ ఉండటం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ద్రావణం తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు.
ఐదు ఆపిల్ పండ్లను తీసుకొని, రెండు నారింజ పండ్లను తీసుకొని వాటిని బాగా పిండి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని తాగటం వల్ల క్రియ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే గుండె సంబంధ వ్యాధులను తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
కూరగాయలను రసం రూపంలో తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గవచ్చు. టమోటా, క్యారెట్, బీట్ రూట్ లను తీసుకొని వీటి నుండి రసం తీసుకోవాలి. అందులోకి కొంచెం అల్లం కలుపుకొని తాగటం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా దానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కానీ ఈ రసమును ఎప్పటికి అప్పుడు తయారు చేసుకుని తాగాలి.
రెండు యాపిల్ పండ్లను, రెండు కప్పుల స్ట్రాబెర్రీ పండ్లను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి కొంచెం నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీర బరువు ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి