మనం రకరాలుగా పడుకోని నిద్ర పోతూ ఉంటాం.మనం నిద్రలో పడుకునే విధానాన్ని బట్టి మనం పూర్వ జన్మ ఎలాంటిదో కూడా తెలుసుకోవచ్చట.. మనం పూర్వ జన్మలో ఎలా పుట్టాము అని తెలుసుకోవాలని ప్రతి మనిషికి కూడా ఎంతో కుతూహలంగా ఉంటుంది..ఇక మనం నిద్ర పోయే విధానాన్ని బట్టి మన పూర్వజన్మ విషయాలను పలువురు నిపుణులు స్వయంగా తెలపడం అనేది గమనార్హం. మీరు నిద్రలో ఎలా పడుకుంటారు తెలుసుకొని మీ గత జన్మ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.ఇక నిద్రలో కనుక గుండె మీద రెండు చేతులు నమస్కారం చేసే విధానంగా పెట్టుకుని పడుకునే వాళ్ళు గత జన్మలో మంచి భక్తుడై వుంటారు.అలాగే పడుకున్నప్పుడు తల, చేతులు ఇంకా కాళ్లు అస్తవ్యస్తంగా పెట్టుకొని పడుకుని ఉంటే శుద్ధాత్మ కలవారై ఉంటారు.అలాగే విష్ణుమూర్తి శేషశయ్యపై పడుకున్నట్టుగా పడుకునే వారు సర్వ శుభ లక్షణాలను కలిగి ఉంటారు.



ఇంకా నిద్రలో రెండు చేతులని దిండుగా చేసుకొని ఒక పాదం మీద ఇంకో పాదం పెట్టుకొని పడుకునే వాళ్ళు పూర్వ జన్మలో మంచి సాధకుడు అయి ఉంటారట.అలాగే మీరు రెండు చేతులు గుండె మీద కలిపి పెట్టుకుని నిద్రించే వారు అయితే పూర్వజన్మలో మంచి యోగి అయి ఉంటారు.ఇంకా అలాగే నిద్రలో రెండు మోకాళ్ళు రొమ్ము లోపలికి లాక్కుని ముడుచుకుని పడుకునే అలవాటు ఉన్న వారు ఖచ్చితంగా పూర్వజన్మలో శునకమై ఉంటారు.అలాగే ఎడమ వైపు తిరిగి 2 కాళ్లను చాపుకొని పడుకునే వాళ్ళు శ్రేష్టులు ఇంకా అలాగే శాంత గుణం కలిగిన వారు.ఇంకా అబ్బాయిలు బోర్లా పడుకునే అలవాటు ఉన్న వారు అయితే చాలా హీనమైన స్వభావం కలిగి ఉంటారు.ఇక సాధారణంగా చెప్పాలంటే మగవాళ్ళు బోర్లా పడుకోకూడదు. ఇంకా ఆడవాళ్ళు వెల్లకిలా పడుకోవడం అసలు మంచిది కాదు. ఈ విషయాన్ని మన పెద్దవాళ్ళు చెప్పిన కూడా మనం అసలు పట్టించుకోము.

మరింత సమాచారం తెలుసుకోండి: