చక్కెర కలిపిన టీ మనం సాధారణంగా తాగుతూ ఉంటాం. కానీ ఉప్పు కలిపిన టీ ఎప్పుడైన తాగారా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు అల్లం టీ, ఇలాంచి టీ, పుదీనా టీ, బెల్లం టీ, బ్లాక్ టీ, మిల్క్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ , హెర్బల్ టీ ఇలా ఎన్నో వెరైటీల్లో టీ తయారు చేస్తారు. అయితే కొందరికి టీ అతిగా తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మితంగా టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ టీకి కొద్దిగా ఉప్పు కలిపి తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఎందుకంటే ఉప్పులో శరీరానికి అవసరమైన మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా టీలో ఉప్పు కలపడం మీ మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ టీ మైగ్రేన్‌లను తగ్గిస్తుంది. మైగ్రేన్ అనేది నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఓ మోస్తరు ఉప్పుతో టీ తాగడం అలవాటు చేసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.రోగనిరోధక జీవక్రియకు మేలు చేస్తుంది. సాల్టెడ్ టీ తాగడం వల్ల శరీరం  రోగనిరోధక శక్తి ఇంకా జీవక్రియను పెంచుతుంది.


సాల్టెడ్ టీ తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.ఈ టీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. టీలో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.ఇక ఉప్పులో సోడియం మరియు క్లోరైడ్ ఉంటాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. కండరాల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.ఈ టీ తయారు చేయడం చాలా ఈజీ పని. మామూలుగా చేసే టీలో కాస్త ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ మెరుగవుతుంది. కణజాలంలోకి పోషకాలు మరింత సులభంగా చేరుతాయి. సాల్ట్ టీ రక్తపోటు నియంత్రణకు, కడుపులో కావాల్సినంత జీర్ణరసం ఉత్పత్తికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్ల బెడద తప్పుతుంది. చలికాలం ముగుస్తున్న సమయంలో కనీసం రెండు సార్లు ఈ టీ తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జపాన్, యూరప్ వంటి దేశాలలో ఈ రకమైన టీ ఎక్కువగా తాగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: