ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లో దోమల బెడద అనేది సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఏకంగా మనుషులపై దోమలు కక్షగట్టాయేమో అన్న విధంగా వాటి తీరు ఉంటుంది. సరిగ్గా పడుకునే సమయానికి నిద్రను చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి దోమలు. కుట్టడం లేదంటే చెవి దగ్గర సౌండ్ చేయడమో చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దోమల బెడదకు చాలామంది సరిగా నిద్ర రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు.


 అయితే ఇలా దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది కాయిల్స్ వాడుతూ ఉంటారు. ఇంకొందరు ఎలక్ట్రానిక్ యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వాటి నుంచి వచ్చే రసాయనాల ద్వారా దోమలు చనిపోతాయని చెబుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలా దోమల బెడదల నివారించేందుకు మార్కెట్లో ఎన్నో రకాల ప్రోడక్ట్లు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇలా దోమల నివారణ యంత్రాల నుంచి వచ్చే రసాయనల ద్వారా ద్వారా అటు దోమలు చనిపోవడం ఏమో కానీ మనుషులకే ప్రమాదం ఉంది అని ఎంతో మంది వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు.



 అందుకే ఎంత కుదిరితే అంత తక్కువగా దోమల నివారణకు యంత్రాలను ఉపయోగించకపోవడమే మంచిది అని చెబుతూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు చాలామంది వీటిని ఆన్ చేసి పడుకోవడం చేస్తూ ఉంటారు. ఇది ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వీటిని వాడటం వల్ల హానికరమైన రసాయనాలు వెలుపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్పుకొచ్చారు. దీంతో శ్వాస చర్మ సంబంధిత సమస్యలు కూడా సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇవి క్యాన్సర్ కు కారణంగా మారతాయి అనడంలో  నిజం లేకపోలేదు అంటూ చెబుతున్నారు. అందుకే కర్పూరం పొగ లేదంటే వేపాకును కాల్చడం ద్వారా దోమల బెడద నుంచి బయటపడాలి అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: