
ఒకటారెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో . ఈ కరోనా మిగిల్చిన విషాదాలు అన్ని ఇన్ని కావు. అందుకే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా అంటే ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేస్తున్నాయ్. దీంతో చాలామంది ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మాస్కులు శానిటైజర్లు కొని పెట్టుకుంటున్నారు. అయితే కేవలం మాస్క్ వేసుకొని శానిటైజర్ రాసుకుంటే కరోనా మన దరిచేరదా..? అంటే మాత్రం నో అని చెప్పాలి. ఎటువంటి వైరస్ అయినా మన బాడీలోకి త్వరగా ఎక్కిస్తుంది. అది ఎప్పుడు అంటే మన ఇమ్యూనిటీ లెవెల్ లోగా ఉన్నప్పుడే.
మన బాడీలో వైరస్ లను ఎదురుకునే అంత రోగ నిరోధక శక్తి ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత డైటింగ్ డైటింగ్ అంటూ కడుపునిండా తిండి తినడం మానేస్తుంది. అంతేకాదు కొంతమంది ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటున్నారు. దీని ద్వారా మన రోగ నిరోధక శక్తి పూర్తిగా పాడైపోతుంది . అయితే హెల్త్ డైట్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ . అది కూడా స్వచ్ఛమైన ఇండియన్ డైట్ . మరీ ముఖ్యంగా మన ఇళ్ళలో మసాల పెట్టిలో ఉండే దినుసులు వాడటం చాలా మంచిది.
పసుపు - జీలకర్ర - మిరియాలు..అలాగే అల్లం-తేనే- తులసి ఆకు - తమలపాకు ఇలా ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల మన బాడీ లో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. రోజుకి రెండు లేదా మూడు ఉడకబెట్టిన గుడ్లు.. రెండు కట్టల ఆకుకూరలు ..ఫ్రెష్ క్యారెట్ జ్యూస్.. బీట్ రూట్ జ్యూస్..నానా బెట్టిన పల్లీలు.. ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి . అంతేకాదు రోజు మెంతు నీళ్ళు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా మిరియాల కషాయం తాగడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అంటున్నారు డాక్టర్స్. కరోనా వచ్చిన తర్వాత కేర్ తీసుకోవడం కన్నా కరోనా రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది . తద్వారా మీ పక్క ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది..రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం కూడా సేఫ్ గా ఉంటుంది అంటూ డాక్టర్స్ కరోనా రాకముందే మీ హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోండి అంటూ చెప్పుకొస్తున్నారు..!!