అమెరికాలో కోవిడ్ కేసులు రోజు రోజుకి ఎక్కువగా విద్యంభిస్తున్నాయి. ముఖ్యంగా వందలలో మరణాల సంఖ్యలు కూడా నమోదు అవుతూ ఉండడంతో అక్కడి ప్రజలే కాకుండా భారతీయులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి అక్కడ తమ పిల్లలు చదువులు,ఉద్యోగాల కోసం పంపించిన వారు భయభ్రాంతులకు గురవడమే కాకుండా అక్కడ నుంచి కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో పిల్లలు, వృద్ధులకు, దీర్ఘ రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు కరోనా ప్రాణ సంఘటనంగా మారిందని అక్కడ నిపుణులు తెలియజేస్తున్నారు.



ముఖ్యంగా గత నెలలోనే సగటు వారానికి 350 మంది చొప్పున కరోనా మరణాల సంఖ్య నమోదు అయినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇవి మరిన్ని కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదు అవుతున్న కేసులలో ఎక్కువగా NB1.8.1 వేరియంట్ కేసులని సిడిసి తెలియజేస్తున్నారు. చైనాలో కూడా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో పాటు ఇతర ఆసియా దేశాలలో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. కొత్త కరోనా వేరియంట్ కేసులు ఎక్కువగా అమెరికాలో కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూయార్క్ సిటీ తదితర ప్రాంతాలలో ఎక్కువగా నమోదవుతున్నాయని అక్కడ అధికారులు తెలుపుతున్నారు.



ఇక విమానాశ్రయాలలో విదేశీ పర్యటకులకు కూడా పరీక్షలు  నిర్వహించి అమెరికాలో అడుగుపెట్టేలా చూస్తున్నారు..అయితే ఈ వైరస్ చైనా, జపాన్ ,దక్షిణ కొరియా, ఫ్రాన్స్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల వల్లే వైరస్ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. దేశంలో కోవిడ్ కేసులు కూడా మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నటి రోజున దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. అయితే వైద్యులు మాత్రం ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ చెబుతున్నప్పటికీ మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మహారాష్ట్ర, కేరళ ఢిల్లీ వంటి ప్రాంతాలలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: